నేనొచ్చేది అప్పుడే..

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజుల నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమే రాక కోసం పార్టీ ఎదురుచూస్తుందంటూ పార్టీలోని కొందరు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారట.

ఇక జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఆమే రాజకీయాలకు కొంచం దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా శశికళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నేను సరైన సమయంలోనే నా ఎంట్రీ ఉంటుందని, పార్టీని కాపాడుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతొ ఆమే త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నారని సమాచారం.

కరోనా కేసుల తగ్గాక ఆమే పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉళుందూరుపేట ఆనంది, పార్టీ నిర్వాహకులతో శశికళ మాట్లాడిన మరో వీడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోపై స్పందించిన శశికళ మద్దతుదారులు స్పందిస్తూ.. శశికళతో సమావేశమయ్యేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారని అన్నారట. ఇక కోవిడ్ తగ్గాక శశికళ పార్టీలోకి వచ్చి పార్టీని నడిపించనున్నారని తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: