బాలయ్యతో ఢీ అంటున్న వరలక్ష్మి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో విభిన్న పాత్రలను అలవోకగా నటిస్తూ నటన పరంగా మంచి మార్కులే కొట్టేస్తొంది వరలక్ష్మి శరత్ కుమార్. అటు హీరోయిన్ ఇటు లేడీ విలన్ పాత్రలను సమానంగా చేసుకుంటూ విభిన్న పాత్రలను అందుకుంటోంది. ఇక తెలుగులో వరలక్షిఅనేక చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపుందనే చెప్పాలి.

ఈ క్రమంలోనే తాజాగా అల్లరి నరేష్‌ హీరోగా వచ్చిన నాంది చిత్రంలో నటించింది ఈ హీరోయిన్. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. తాజాగా మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న నందమూరి బాలయ్య మూవీలో వరలక్ష్మి నటించనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. దీనిపై స్పందించిన ఆమే..గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: