బీజేపీకి షాక్..సొంతగూటికి ముకుల్ రాయ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బెంగాల్ బీజేపీకి షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌లో రానున్నది బీజేపీ ప్రభుత్వమని కాషాయ నేతలు నేతలు ఓ రేంజ్‌లో పెదవి విరిచారు. కానీ పరిస్థితి మాత్రం బీజేపీ అంతగా అనుకూలించకపోవడంతో మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర బీజేపీకి షాక్ తగిలేలా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బెంగాల్ బీజేపీ ముఖ్య నేత ముకుల్ రాయ్ తిరిగి సొంత గూటికి చేరేందుకు తెరవెనక మంతనాలు జరుపుతున్నారట. ఈయనతో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్స్ రాయ్ కూడా టీఎంసీలో చేరేందుకు సిద్ధమయ్యారట. నేడో రేపో టీఎంసీలో చేరేందుకు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: