ముగిసిన జగన్ హస్తినయాత్ర

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపిన ఆయన తిరిగి ఏపీకి చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, మూడు రాజధానులు, విశాఖ స్టీల్ ప్లాంట్, కాకినాడ పెట్రో కాంప్లేక్స్ వంటి అంశాలపై సమావేశాలు జరిగాయి. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జావడేకర్, పీయూష్‌ గోయల్, గజేంద్రసింగ్ వంటి కేంద్రమంత్రులతో చర్చించారు. ఇక జగన్ ఢిల్లీ టూర్ పై ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇక రఘురామ వ్యవహారంపై కూడా ఢిల్లీ వెళ్లాడని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఇక మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: