ఒకే సాంగ్‌లో ఇద్దరు మెగా హీరోలు?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా కుటుంబంలో సినిమా అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఆ కుటుంబం నుంచి ఎవరి సినిమా వచ్చినా కాలరేగరేస్తూ ఉంటారు మెగా అభిమానులు. ఇక అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు కనిపించనున్నారంటే ఇంకేంటి మెగా ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. తాజాగా అలాంటి వార్తే ఒకటే ఫిల్మ్‌నగర్ హల్‌చల్ చేస్తోంది. ఇక విషయానికొస్తే..అల్లు అర్జున్ హీరోగా సుకుమర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప.

250 కోట్లతో భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి బన్నీతో కలిసి డ్యాన్స్ చేయనున్నాడనే వార్త ఫ్యాన్స్‌ని హుషార్ చేస్తోంది. గతంలో చిరంజీవి డాడీ సినిమాలో ఓ పాటలో బన్నీ కనిపించాడు. ఇక ఇందులో ఇద్దరు కలిసి కొన్ని స్టేప్‌లు సైతం వేశారు. అలాంటి పుష్పలో కూడా వేయనున్నారనే వార్త కొన్ని రోజుల నుంచి తెగ హల్‌చల్ చేస్తుంది. మరి ఇంతకు నిజంగానే చిరు పుష్ప సినిమాలో బన్నీతో ప్టేప్‌లు వేయనున్నారనేది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: