ఏపీలో నేటీతో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలోని శుక్రవారం నాటికి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం దానిపై అడుగులు వేస్తోందట. గవర్నర్ కోటలో ఖాళీ కానున్న ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఎవరెవరికి కేటాయించనున్నారని పార్టీలోని కొందరు నేతలు తమలో తాము చర్చించుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధులను సైతం పార్టీ అధిష్ఠానం ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

భర్తీ అయ్యే స్థానాలకు మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి)పేర్లను పరిశీలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలోని కొందరు నేతలు తమకు వస్తుందేమోనని ధీమాతో ఉన్నారట. ఇక మాకంటే మాకు అన్నట్లుగా ఎవరికి వాళ్లే తమలో తాము సంతోషపడుతున్నారట.

Share.

Comments are closed.

%d bloggers like this: