శరద్ పవార్‌తో పీకే భేటీ అందుకేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ప్రధానంగా ప్రధాని మోడీని ఎదుర్కునేందుకు మిషన్-2024 లక్ష్యంగా సాగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యే జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు వ్యూహకర్తగా వ్యవహరించి అనుకోలేని విజయాన్ని దీదీకి అందించారు ప్రశాంత్ కిశోర్.

దీంతో ఇక నుంచి ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా శరద్ పవార్‌తో భేటీ కావడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇక బీజేపీని 2024 లో అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ప్రశాంత్ వ్యూహాలను వాడుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు ఎవరున్నా ఆయన వ్యూహాలకు తలవంచాల్సిందే. ఇక మొత్తానికి దేశంలోని ప్రతిపక్షాలన్ని తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: