ప్రధానితో యోగి భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యెగి ఆదిత్య నాథ్ ఢిల్లీలోని పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి గంటన్నరకు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రధాని మోడీని కూడా కలిసినట్లు తెలుస్తోంది.

యూపీ ప్రభుత్వంలొ కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో వరుస భేటీలు జరుగుతున్నాయని యూపీ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. యోగి ప్రభుత్వంలోని కొంతమంది అసమ్మతి నేతలు యోగి ప్రభుత్వాన్ని దించేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు సైతం ఊపందుకున్నాయి. ఇక ప్రభుత్వంలోని మార్పులు, రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నుంచి కీలక పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: