కాంగ్రెస్‌కు షాక్..టీఆర్ఎస్‌లోకి కౌశిక్ రెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

హుజురాబాద్ రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారం నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల రాజీనామాతో అనివార్యం కానున్న ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో రాజకీయాలు సరికొత్త రంగును పులుముకుంటున్నాయి.

ఇక టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనుండడంతో టీఆర్ఎస్ కొత్త నాయకుని కోసం దారులు వెతుకుతున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డిని కారు ఎక్కించేందుకు ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగారట. ఇక కౌశిక్ రెడ్డితో కేటీఆర్‌ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా తీర్చుదిద్దేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేస్తుంది టీఆర్ఎస్. ఇక రానున్న ఉపఎన్నికకు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్ధిగా నిలపనున్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: