ఈటలను కలిసిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపుగా ఖాయంగా కనిపిస్తుండడంతో నేడు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్ సహా పలువురు భాజాపా నేతలతో ఈటల నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం తరుణ్‌ చుగ్ మాట్లాడుతూ..20 ఏళ్లుగా తెలంగాణ కోసం ఈటల కొట్లాడుతున్నారని ఆయన అన్నారు.

ఇక తెలంగాణ కేసీఆర్ ఇంటి కోసమే వచ్చినట్లుందని, తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను బీజేపీలో స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక ఆయన పోరాటం తెలంగాణకు చాలా అవసరమన్నారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ బర్తరఫ్‌ చేసింది. ఇక త్వరలో ఈటల బీజేపీలో చేరునున్న విషయం తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: