బిగ్‌బాస్ ఎంట్రీపై పాయల్ క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై బిగ్‌బాస్‌ గురించి తెలుగు ప్రేక్షకుడిని ఎవరిని అడిగిన ఇట్టే చెప్పేస్తారు. అంతా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ షో… సీజన్‌-5కి సిద్దమైంది. ఇక ఇందులో జరిగే సన్నివేశాలను తిలకించేందుకు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ షోలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. షోలోని కంటేస్టెంట్స్ వాళ్లు చేసే అల్లరి, చిలిపి పనులు, లవ్ ట్రాక్‌లు వంటివి సదరు వీక్షకున్ని అట్టే కట్టిపడేస్తుంటుంది.

దీంతో ఈ షోకి ఎనలేని ఆదరణ లభిస్తోంది. తాజాగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. బిగ్‌బాస్ సీజన్-5కి పాయల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేసినట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై స్పందించింది పాయల్. ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది ఈ భామా.

ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సాధించింది ఈ సుందరి. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఈ హీరోయిన్ గ్రాఫ్‌ అమాంతంగా పెరిగిపోయింది. ఈ అమ్మడుకు ఈ మూవీ తప్పా మిగతా సినిమాలు పెద్దగా హిట్‌ కాలేదు. ప్రస్తుతం ఓ తమిళం సినిమాలో నటిస్తోంది పాయల్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: