అదే నాకు గొప్ప అవార్డు-సోనూసూద్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్న సోనూసూద్ భారతదేశ ప్రజల ఆరాద్యదైవంగా మారుతున్నారు. వలస కూలీలు, వారి సొంతూళ్ల ప్రయాణానికి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఎనలేని సేవలను అందిస్తున్నారు. ఇక తాజాగా సోనూసూద్‌కి ‘పద్మవిభూషణ్‌’ ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్‌ పెట్టారు. గత కొంతకాలంగా సోనూ చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై సోనూ స్పందించి రిప్లే ఇస్తూ.. ‘బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను’ అని రిప్లై ఇచ్చారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: