కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలోకి రమేష్‌ రాథోడ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

రమేష్‌ రాథడ్ బీజేపీలో చేరబోతున్నారా..? ఇప్పుడు ఈ వార్త బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతోంది. తాజాగా హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని వార్తలు సైతం ఓ రేంజ్‌లో ఊపందుకున్నాయి. ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగాడని త్వరలో టీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలోనే మారో వార్త తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ తగిలేలా కనిపిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్నారు రమేష్ రాథోడ్. 2009 లో ఎంపీగా గెలిచిన రమేష్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరారు. ఇక త్వరలో ఆయన ఈటలతో పాటే ఈ నెల 14న కాషాయ గూటికి చేరుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది గనుక నిజమే అయితే కాంగ్రెస్‌కు భారీ నష్టం జరిగినట్టే.

Share.

Comments are closed.

%d bloggers like this: