ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు ఈటల. ఇక హైదరాబాద్‌లోని గన్‌పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌, కేటీఆర్‌లపై మాటల దాడికి దిగారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగానని, మా వాళ్లపై పెట్టే కేసులు కొత్త కాదన్నారు ఈటల. ఇక హుజురాబాద్‌లో కురుక్షేత్రం జరగబోతోందని ఇది కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే యుద్దమని, అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారని ఈటల రాజేందర్ తెలిపారు. ఇక కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పే రోజు తొందరలోనే వస్తుందని అన్నారు ఈటల

Share.

Comments are closed.

%d bloggers like this: