వారి ఆశీర్వాదంతోనే రాజీనామా-ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల రాజేందర్ గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు, అధికార మదంతో గెలవాలని చూస్తున్నారు అన్నారు ఈటల.

ఇక నేను ప్రజల ఆశీర్వాదంతోనే తన పదవికి రాజీనామా చేశానని, వారి మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కరోనాతో చనిపోతుంటే తనకు ఏమీ పట్టనన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఇక రానున్నది కురుక్షేత్ర యుద్దమని, అందులో అంతిమంగా ప్రజలే గెలుస్తారని తెలిపారు ఈటల.

 

Share.

Comments are closed.

%d bloggers like this: