పవన్‌తో సినిమాపై పెదవి విప్పిన మళయాళ నటి

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు సమానంగా చూసుకుంటు ముందుకెళుతున్నాడు ఈ మెగా హీరో. ఇక వరుస సినిమాలు సైన్ చేస్తూ స్పీడ్ పెంచేశాడు పవన్ కళ్యాణ్‌. దీంతో హరీష్‌ శంకర్‌తో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గురించి తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మళయాళ నటి మానస రాధాకృష్ణన్ పవన్‌తో ఈ మూవీలో నటిస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ తెగ వైరల్ అవుతోంది. ఇక తాజాగా రాధాకృష్ణన్ గురించి పవన్ అభిమానులు నెట్‌లో ఆమె గురించి వెతుకున్నారట. ఇలాంటి వార్తలపై రాధాకృష్ణన్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ గారు అంటే తనకు ఇష్టమని, కానీ ఆయన సినిమాల్లో నటించటం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: