అదెప్పటికీ సాధ్యం కాదు-రఘురామ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ నిన్న లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు ఎంపీ భరత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు రఘురామ. ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను మాత్రమే ప్రస్తావించానని, తనపై అనర్హత వేటు సాధ్యం కాదంటూ తెలిపారు.

హోంమంత్రి అమిత్‌ షాను కలిశాకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశాను. కానీ నిజాలు ఎప్పటికైనా బయట పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలో పిర్యాదు చేసినట్లు అమిత్ షా లేఖలో తెలిపారు ఎంపీ భరత్

Share.

Comments are closed.

%d bloggers like this: