కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు?

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రమంత్రి వర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ప్రధానితో హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. దీంతో మంత్రి వర్గ విస్తరణకే సమావేశం అయ్యారంటూ ఓ వైపు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

గురువారం జరిగిన సమావేశంలో వివిధ శాఖల మంత్రుల పనితీరుపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రెండవ దఫా ప్రధానమంత్రిగా కొనసాగిన నాటి నుంచి మంత్రి వర్గంలో మార్పులు జరగలేదు. దీంతో ఈ భేటీలో ఇలాంటి అంశాలే తెరపైకి వచ్చినట్లు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. ఇక ప్రధానంగా కేబినెట్‌లో మార్పులు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: