ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా-వైష్ణవ్‌తేజ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లోకి ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌. ఈ చిత్రంతో ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగింది. నటించిన తొలి సినిమానే అయినా అద్భుతమైన నటనను కనబరిచాడు. దీంతో ఈ హీరోకి ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వైష్ణవ్‌తేజ్‌ క్రిష్ దర్శకత్వంలోనే కాక, గిరీశయ్య అనే దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడని తెలిపాడు వైష్ణవ్‌తేజ్.

తాజాగా వైష్ణవ్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులను పలకరించే ప్రయత్నం చేశాడు. ఇక ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలను షేర్ చేశాడు ఈ మోగా మేనల్లుడు. ఓ నెటిజన్ ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని అడగ్గా..నాకు ఆమె ఇష్టం కాదని, ప్రేమ అని, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నానని మనసులోని మాటలు బయటపెట్టాడు వైష్ణవ్‌. ఇక దీంతో పాటు నాకు రజీనికాంత్ అంటే ఇష్టమని, శివాజీ సినిమా చాలా సార్లు చూశానని తెలిపాడు. సమంతా గురించి అడగ్గా..ఫ్యామిలీ మేన్‌-2లో సమంత నాకెంతో నచ్చేసిందని తెలిపాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: