జగతిబాబుకు బాబుగోగినేని చురకలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందుపై తెలుగు రాష్ట్రాల్లో ఓ భిన్నమైన వాదన కొనసాగుతోంది. కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. తాజాగా ఆనందయ్య మందుపై స్పందించాడు జగతిపతిబాబు. స్పందించడమే కాకుండా మందును కూడా వేసుకున్నానని, మందు బాగా పనిచేస్తుందని, ఆయూర్వేదంపై నాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపాడు.

ఇదిలా ఉండగా హేతువాది అయిన బాబు గోగినేని ఆనందయ్య మందుపై మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జగతిబాబుపై బాబు గోగినేని ఫేస్‌ బుక్‌లో ఓ పోస్ట్ చేస్తూ చురకలు అంటించాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్‌ చేశారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఓ లోకల్‌ ఇంగ్లీష్‌ వెబ్ సైట్‌లో వార్త వచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: