ఈటల రాజీనామాకు స్పీకర్ ఆమోదం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమెదం తెలిపారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రవర్గం నుంచి భర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల క్రితమే ఈటల రాజీనామా పత్రాన్ని
అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు ఈటల. దీంతో వెంటనే స్పందించిన శాసనసభ స్పీకర్ పోచారం ఈటల రాజేందర్ రాజీనామా పత్రానికి ఆమెదం తెలిపారు. ఇక త్వరలో ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: