జగన్‌కి బీజేపీ అగ్రనేతల ప్రపోజల్..అదేంటంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత రెండు మూడు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాట్ హాట్‌గా సాగింది. ఈ పర్యటన గురించి రాజకీయ వర్గాల్లో భిన్నవాదనలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ఢిల్లీ వెళ్లారని కాదు..కాదు..తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన హస్తినయాత్ర కొనసాగించారని ఎవరికి వాళ్లు ఊహించుకుంటున్నారు.

ఏదేమైనా ఢిల్లీ పర్యటనలో కొన్ని కీలక విషయాల గురించి సీఎం జగన్‌తో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటితో ఏపీలో నాలుగు శాసనమండలి స్థానాల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన నాలుగు స్థానాల్లోని మూడు బీజేపీ ఇవ్వాలని తెలిపినట్లు సమాచారం.

మరి ఇంతకు జగన్ ఏమ్నన్నారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇక వీరిద్దరి మధ్య తెరవెనకా ఓ మైత్రీ బంధం కొనసాగుతోందని ఓ వర్గం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో జగన్ బీజేపీ అగ్రనేతల కోరికను తీరుస్తారా? లేక లేదంటూ సమాధానం చెబుతారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: