ప్రశాంత్ కిశోర్‌తో షారుఖ్‌ఖాన్ భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఎవరికందనంత ఎత్తులో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ప్రత్యర్ధులకు చుక్కులు చూపిస్తూ తన పకడ్భందీ వ్యూహాలతో రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపాడు ప్రశాంత్. గత కొన్ని నెలల కిందట తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చిక్కకుండా రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులను అందించాడు.

ఇక ఈ ఎన్నికల అనంతరం ఇక నుంచి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పినట్లే చెప్పి మళ్లీ రంగంలోకి దిగారు ప్రశాంత్ కిశోర్. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయి రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌ను కలిశారు ప్రశాంత్ కిశోర్. రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్లే ప్రశాంత్ షారుఖ్‌ఖాన్ తో భేటీ కావడం రాజకీయ వర్గంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ కిషోర్ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని షారుక్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకోసమే పీకే తో చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: