లక్షమందితో సిద్ధమైన హెల్త్ ఆర్మీ

Google+ Pinterest LinkedIn Tumblr +

భారతదేశంలోకి కరోనా వచ్చి ఏడాది పైగా గడిచిన ఎక్కడి బతుకులు అక్కడే ఉన్నాయి. కరోనాతో అన్ని రంగాలు అతలాకుతలమైపోయాయి. విద్యావ్యవస్థ, పారిశ్రామికరంగం, వంటి అనేక రాంగాలు ఇప్పటికీ ఇంకా కోలుకోనేలేదు. ఇక వలస కూలీల బతుకులు రోడ్డున పడి లేవకముందే సెకండ్ వేవ్‌ అంటూ మళ్లీ దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితుల్లో కరోనాతో జీవించాల్సి వస్తుంది.

ఇదిలా ఉండగా థర్డ్ అంటూ మరొకటి తన్నుకొస్తొంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రమాదం చూపే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మొదటి వేవ్, సేకండ్ వేవ్‌ నుంచి చేర్చుకున్న పాఠాలతో థర్డ్ వేవ్ నివారణకు సిద్దమైంది. దీంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ ఈ మేరకు కసరత్తు చేపట్టిందని సంబంధిత అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటికే కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ 225000 మందికి ఆరోగ్యకార్యకర్తలుగా పని చేయటానికి వీలైన సమగ్రమైన శిక్షణనిచ్చింది. ప్రస్తుతం మరో లక్ష మందిని సిద్ధం చేయనుంది. వీరు ప్రభుత్వ దవాఖానల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దవాఖానల్లోనేగాక పేషంట్లకు వారి ఇండ్లలోనే ఆరోగ్య సేవలు అందించటంలో శిక్షణ పొందుతారని తెలిపారు అధికారులు.

Share.

Comments are closed.

%d bloggers like this: