పదవిలో ఉనప్పుడు బీసీలు గుర్తుకురాలేదా?-కౌశిక్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇదిలా ఉండగా స్థానిక హుజురాబాద్ కాంగ్రెస్ నేత పాడా కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ పై విమర్శనస్త్రాలు సందించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ..పదవిలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకురాలేదా?, టీఆర్ఎస్ నుంచి బయటకు రాగానే ఆత్మగౌరవం, బీసీలు గుర్తొస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

హుజురాబాద్ లో ఉండే ప్రతి బీసీ బిడ్డలు అన్నీ గమనిస్తున్నారని, ఇన్ని ఆస్తులు ఎలా సంపాందించారో చెప్పాలని అన్నారు. కేసీఆర్ తో మంత్రి పదవిలో ఉన్న మీరు ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నారన్నారు. అనవసరంగా నన్ను బయటకు లాగుతున్నారని, ఇది మంచి విషయం కాదంటూ తెలిపారు కౌశిక్ రెడ్డి. ఇదిలా ఉండగా తాజాగా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళుతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా ఈటలపై చేస్తున్న కౌశిక్ రెడ్డి వాదన చూస్తుంటే టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి

 

Share.

Comments are closed.

%d bloggers like this: