బింబిసారకు ఎన్టీఆర్ మాట సాయం

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కళ్యాణ్ రామ్ గతంలో ఎన్నడు కూడా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఈ సారి అలాంటి ప్రయోగమే చేయనున్నాడు కళ్యాణ్ రామ్. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడు నందమూరి హీరో. దీంతో ఇలాంటి చిత్రాలపై ప్రేక్షకులకు చాలా అంచనాలుంటాయి.

గతంలో బాహుబలి, రుద్రమదేవి వంటి చారిత్రిక నేపథ్యం ఉన్న చిత్రాలు బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను సైతం విడుదల చేశారు మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ అందించనున్నాడని తెలుస్తోంది. కథ మలుపు తిరిగే క్రమంలో ఆయన డ గొంతు వినిపిస్తుందని అంటున్నారు. మరి ఇంతకి ఈ వార్తలో నిజమేంత అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: