సోనూసూద్ నుంచి మరో శుభవార్త

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కాలంలో కష్టాల్లో ఉన్నవారికి ఆరాధ్యదైవంగా మారాడు సోనూసూద్. అడిగిన వెంటనే అన్నీ ఇస్తూ హెల్పింగ్ స్టార్ గా మారాడు. ఇది కాక దేశవ్యాప్తంగా ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరో శుభవార్తను అందించాడు సోనూసూద్.

ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల అండగా నిలిచేందుకు ముందుకు కదిలాడు. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. స్కాలర్‌షిప్స్ కోసం http://www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూ సూద్ తెలిపాడు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జూన్ 30లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని కోరాడు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: