వాళ్లు కూడా రాజీనామా చేయాలి-పొన్నం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వచ్చిన భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే స్పందించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. పార్టీ మారుతున్నందుకు నైతిక బాధ్యతతో ఈటల రాజేందర్ రాజీనామా చేశారు అన్నారు పొన్నం ప్రభాకర్.

దీంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారందరినీ కూడా వెంటనే సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో పేద ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వెంటనే వారిని ఆదుకోవాలని కోరారు పొన్నం ప్రభాకర్.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: