ప్రభాస్ కు జోడీగా రాశీ

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ రేంజ్ ను దేశవ్యాప్తంగా చూపించిన ఈ హీరో తాజాగా వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూకుడుపెంచుతున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రమే కాకుండా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో సినిమాకు సైన్ చేశాడంట ప్రభాస్. ఇదిలా ఉండగా ఇందులో ఇద్దరు హీరోయిన్ లు నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఇంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను ఫిక్స్ చేయగా మరో హీరోయిన్ వేటలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాశీఖన్నాను ఎంపిక కోసం మూవీ యూనిట్ చర్చలు జరుపుతోందట. మరి ఇంతకు రాశీఖన్నా ప్రభాస్ మూవీలో ఛాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: