సీఎం జగన్ కు రఘురామ నాలుగో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సీఎం జగన్ కు వరుసగా లేఖలు రాస్తూ రాజకీయంగా సంచలనంగా మారుతున్నారు. గత మూడు రోజుల నుంచి లేఖలు రాస్తున్న రాఘురామరాజు ఈ రోజు కూడా నాలుగో లేఖ రాశారు. రాజకీయంగా ఈ అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది.

ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల క్యాలెండర్ హామీని సీఎం జగన్ మరిచిపోయారని, త్వరలో ఈ హామీని అమలు చేయాల్సిందిగా నాలుగో లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు 18,000, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,000 భ‌ర్తీకి సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. దీంతో వెంటనే నిరుద్యోగులకు నోటిఫకేషన్ విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీతోనే నిరుద్యోగులు మీకు ఓట్లు వేశారని లేఖలో తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: