రాష్ట్రపతి బరిలో శరద్ పవార్?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రపతి అభ్యర్ధిగా రేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉండనున్నారా?..ఇప్పుడు ఇదే వార్త రాజకీయ వర్గల్లో తీవ్ర చర్చకు దారి దారితీస్తుంది. తాజాగా శరద్ పవార్ తో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ ఇదే అంశంపై చర్చించినట్లు వార్తలు ఊపందుకుంటున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్ధిగా శరద్ పవార్ భరిలో నిలవనున్నారని మీడియా కోడై కూస్తోంది.

మొన్న జరిగిన వీరిద్దరి భేటీలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించినట్లు రాజకీయంగా ఊహాగానాలకు తెర తీస్తుంది. ఇక దేశంలోని ప్రతిపక్షాలను ఏకదాటిపైకి తెచ్చి ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్దిగా శరద్ పవార్ ను నిలపాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాషాయాన్ని దాటుకుని ప్రతిపక్షాలు రాష్ట్రపతి స్థానాన్ని దక్కించుకోగలవా అని మేధావి వర్గం చర్చించుకుంటోంది. ఏదీ ఏమైన ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: