ఇక సెలవు అంటున్న నువ్వునేను హీరోయిన్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమకు నువ్వునేను సినిమాతో పరిచయమైన హీరోయిన్ అనిత. ఈ చిత్రంతో ఈ హీరోయిన్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమాతో అవకాశాలు సైతం బాగానే వచ్చాయి. ఉన్నట్టుండి గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.

ఇక బుల్లితెరలో నాగిని వంటి సీరియల్స్ తో పాటు కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ వస్తుంది ఈ హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే రోహిత్ అనే పారిశ్రామిక వేత్తను 2013 లవ్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి కొంత ఇంటికే పరిమితమైన అనిత ఓ బాబుకి జన్మనిచ్చింది. దీంతో తాజాగా ఓ వార్త అభిమానులకు చేరవేసింది. ఇక నుంచి సినిమాలకు విరామం తెలుపుతున్నానని, భవిష్యత్తులో మళ్లీ నటిస్తానో లేదో తెలియదని తెలిపింది అనిత.

 

Share.

Comments are closed.

%d bloggers like this: