ఎంతటి వారైన వదిలేది లేదు-మంత్రి అవంతి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలోని భూ కబ్జాల నేపథ్యంలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..పల్లా శ్రీనివాసరావు బంధువుల్లో ఒకరైన శంకరరావుకి చెందిన కబ్జా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. వీళ్ల కబ్జాలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు.

ఇక శంకరరావుకి చెందిన 61 ఎకరాల్లో అందులో 49 ఎకరాలు ప్రభుత్వ భూమేనని ఆయన తెలిపారు. ఇక నుంచి భూ కబ్జాలకు ఎవరు పాల్పడ్డ వదిలే సమస్యలేదని తేల్చి చెప్పారు మంత్రి అవంతి. దీంతో పాటు వైసీపీలోని నేతలు ఎంతటివారైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎవ్వరిని ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: