కాకరేపుతున్న యూపీ రాజకీయాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతూ ప్రభుత్వంలో హీట్ పుట్టిస్తున్నాయి. గత కొంతకాలంగా యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌పై సొంత పార్టీ నేతలే అసమ్మతి రాగం ఎత్తుకుంటున్నారు. సీఎం యోగిపై సొంత నేతలే అసహనం వ్యక్తం చేస్తుండడంతో రాజకీయాలు ఎటు పోతున్నాయో అని సీఎం యోగి తల పట్టుకుంటున్నారు.

యూపీలో గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు మూడవ శాతానికి పరిమితమవడంతో పాటు కరోనాను ఎదుర్కోవడంలో యోగి పూర్తిగా విఫలమయ్యాడంటూ కాషాయ నేతలు కొందరు బహిరంగంగానే పలుకుతున్నారట. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ హస్తినబాట పట్టారు. ఇక ప్రధాని, అమిత్ షాతో గంటకు పైగా చర్చించారు సీఎం.

ఇక ఈ భేటీలో తనపై వస్తున్న అసమ్మతి ఆరోపణల అంశంపైనే ప్రధానంగా చర్చి జరిగినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన జరిగిందని కొందరు మేధావి వర్గం నేతలు చెబుతున్నారు. ఇక మంత్ర వర్గ విస్తరణతో పాటు సీఎం తొలగింపుపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: