తెలంగాణ టీపీసీసీపై వీడని ఉత్కంఠ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. తాజాగా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హస్తినబాట పట్టారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఎంపికైనే ప్రధానంగా వీరు ఢిల్లీకి వెళ్లారని జోరుగా చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి సా..గుతున్న టీపీసీసీ ఎంపికపై కాంగ్రెస్ ఇంకా ఏం తేల్చుకోలేకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

ఈ క్రమంలోనే టీపీసీసీ ఆశావహులు తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది ఉన్నా..ముగ్గురు మాత్రమే రేసులో ఉన్నట్లు ఓ వర్గం నేతలు చెబుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి లేదా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ ఇద్దరిలో ఒకరికే టీపీసీసీ వస్తుందని మేధావివర్గం చర్చించుకుంటుంది. ఇక ఏఐసీసీ మాత్రం టీపీసీసీ పదవిని ఎవరికి ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారట. దీంతో ఎంపీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఢిల్లీకి పయనమవడంతో ఏఐసీసీ నుంచి రేపో మాపో టీపీసీసీ ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: