కోర్ కమిటీ నిర్ణయం అవసరం లేదా?-పెద్దిరెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రేపో మాపో బీజేపీలో చేరునున్న ఈటలకు వ్యతిరేకంగా కొందరు బీజేపీ నేతలు భిన్నగళాన్ని ఎత్తుకుంటున్నారట. ఇక విషయానికొస్తే ఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరనుండడం అనివార్యమైన వేళ హుజురాబాద్ స్థానిక బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కొత్త రాగాన్ని వినిపిస్తున్నారు.

అసలు కోర్ కమిటీ నిర్ణయం లేకుండా ఈటలను బీజేపీలో ఎలా చేర్చుకుంటారని, స్థానికుడినైన నన్ను బీజేపీ అదిష్టానం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి తనకు సీటు రాకుండా పొతున్నందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఈటల వర్గం నేతలు భావిస్తున్నారు.

ఇక తెలంగాణ బీజేపీలో అసలు కోర్ కమిటీ లేనందున ఈటల చేరికను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సీటు ఎలాగో ఈటలకు కేటాయిస్తుండడంతో పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి. ఇక తెలంగాణ కాషాయ నేతలు పెద్దిరెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: