కేంద్రమంత్రిగా పవన్ కళ్యాణ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కనుందా? ఇప్పుడు ఇదే వార్త తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో కేంద్రంలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి దక్కనుందని గత కొన్ని గంటల నుంచి మీడియా కోడై కూస్తోంది.

రానున్న మంత్రి వర్గ విస్తరణలో ఎలాగైన పవన్ కి కేంద్రమంత్రిగా బాధ్యతలు ఇవ్వాలని కాషాయ నేతలు భావిస్తున్నారట. ఇక వీళ్లిద్దరు ఏపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పవన్ ను యూపీ నుంచి రాజ్యసభ సీటు కేటాయించే దిశగా బీజేపీ నేతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇస్తే జనసేనను నడిపేదెవరంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్రమంత్రి పదవి అంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేతలు అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఇక పవన్ కేంద్రమంత్రిగా రానున్నాడనే వార్తలో నిజం ఎంతన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: