ఈటల వెంటే ఆయన కూడా?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత కొన్ని రోజుల నుంచి భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. దీంతో తన దారేంటో తను చూసుకోవాలని భావించిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదనంతర రాజకీయ పరిణమాల మధ్య బీజేపీలో చేరాలనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఈయనతో పాటే మరికొంతమంది నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా హుజురాబాద్ లో స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్ లు రాజీనామాలు చేసి ఆయన వెంట బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి కూడా ఈటలతో పాటు బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాద కేశవరెడ్డి 2014లో మూడు నెలల పాటు కంటోన్మెంట్‌ పాలక మండలి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. తిరిగి 2015 నుంచి రెండున్నర సంవత్సరాల పాటు బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: