పీకే భేటీలో వచ్చిన క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన రాజకీయంగా ఇప్పటి వరకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఏకంగా రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుపున అభ్యర్థిగా శరద్ పవార్ ను పోటీకి దించేందుకు రంగం సిద్దమైందంటూ వార్తలు వస్తున్నాయి. దీని వెనకల ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు దాగి ఉన్నాయంటూ మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తాజాగా అలాంటి వార్తలపై స్పందించాడు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌. ప్రశాంత్ కిశోర్ ని కలిసింది కేవలం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగానే జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి ప్రధానిని గద్దే దింపే ప్రయత్నాల్లో భాగంగా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను అందించబోతున్నాడని తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: