తెలంగాణ కాంగ్రెస్ లో రాజుకుంటున్న కొత్త వివాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం మళ్లీ రాజుకుంటోంది. పీసీసీ ఎంపికను ఏఐసీసీ మళ్లీ తెరపైకి తేవడంతో సీనియర్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనునుమంతరావు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ పై మండిపడ్డారు.

కొత్త వాళ్లకే పదవులు కట్టబెడుతున్నారని, పాతవాళ్లని కనీసం గుర్తు కూడా చేయడం లేదంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. ఈయనతో పాటు ఇంకా చాలా మంది పార్టీలోని పెద్ద తలకాయలు ఈ విధమైన ఆరోపణలను బహిరంగంగా లేవనెత్తకపోయిన లోలోపల చర్చించుకుంటున్నట్లు తెలుస్తోతోంది. తాజాగా పీసీసీ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుండడంతో ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. ఇక రేపో మాపో పీసీసీ ఎంపికపై స్పష్టత రానుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: