సిక్కోలు కుర్రాడి ప్రతిభ..వెండి నాణెంపై రామ్ చరణ్ ఉపాసన

Google+ Pinterest LinkedIn Tumblr +

సిక్కోలు కళాకారుడైన ముగడ జగదీష్ మెగా హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. నేడు రాంచరణ్ ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా వెండి నాణెం పై 50 నిమిషాల్లో వారిద్దరి ఫోటోలను చేతితో చెక్కి అబ్బురపరిచాడు శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ కస్పావీదికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారుడు ముగడ జగదీష్ వారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ తన ప్రతిభను వెలికితీస్తున్నాడు. ఇక రామ్ చరణ్ పెళ్లి రోజు, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆయన చేస్తున్న ఆక్సిజన్ బ్యాంకు సేవాకార్యక్రమాలకు గుర్తుగా దీనిని తయారు చేసినట్లు పేర్కొన్నాడు ఈ కుర్రాడు. దీనిని రామ్ చరణ్ కు త్వరలో పంపనున్నట్లు తెలిపాడు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: