పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న వార్తలపై కొంచం క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారని, నాకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇచ్చారని తెలిపారు ఎల్. రమణ. నన్ను టీఆర్ఎస్, బీజేపీలు పార్టీలోకి చేరమని కోరాయని తెలిపారు.

దీంతో పాటు నేను పదవుల కోసం పాకులాడు వ్యక్తిని కాదని, సోషల్ మీడియాల్లో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచోసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, ఏ పార్టీలో చేరేది నేను నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక తన అనుచరులతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు రమణ.

Share.

Comments are closed.

%d bloggers like this: