సుశాంత్ సింగ్ ఆత్మహత్యకి నేటికి ఏడాది పూర్తి

Google+ Pinterest LinkedIn Tumblr +

సుశాంత్ సింగ్ రాజ్ పుత్..ఈయన ఆత్మహత్య విషాదానికి నేటికి సరిగ్గా ఏడాది పూర్తైంది. ఎన్నో మలుపులు, మరెన్నో కోణాల మధ్య సాగిన ఈ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడడం సిని అభిమానులనంతా ఒకంత దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలీవుడ్ లో చిచోరే, ధోనీ వంటి సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును లికించుకున్నాడు ఈ యువ హీరో.

భవిష్యత్ లో మరిన్ని సినిమాలతో అగ్ర హీరోల సరసన నిలుస్తున్నాడనుకుంటున్న తరుణంలోనే ఆయన ఆత్మహత్య వ్యవహారం ఎన్నో వివాదాలకు దారి తీసింది. సుశాంత్ ముందు బంగారం లాంటి భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం తన అభిమానులను కన్నీటి సంద్రంలోకి నెట్టేసినట్లైంది. ఇక అనేక కోణాల మధ్య సా…గుతున్న ఈ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసును ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ డీల్ చేస్తుండగా ఇంతకీ ఆత్మహత్యా? లేక ఎవరైన హత్య చేశారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇక దీంతో పాటు డ్రగ్స్ వ్యవహారం కూడా చేరడంతో ఈ కేసు అనుమానంగా మారుతోంది. ఇప్పటికే ఆయన ప్రియురాలు అయిన రియా చక్రవర్తిని, ఆయన సోదరుడిని సైతం విచారించారు అధికారులు. ఇక మొత్తానికి ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు నిజా నిజాలు ఎప్పటికి తేలుతాయో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: