వైసీపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారా?..ఇప్పుడు ఇదే వార్త తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం గురుంచి అందరికీ తెలిసిందే. చిరంజీవి గతంలో వైసీపీ పాలన గురించి పోగడడం, సినిమా పరిశ్రమ సమస్యలను జగన్ వద్దకు తీసుకెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించడం వంటి అంశాలను గమనిస్తే వీరిద్దరి మధ్య ఓ మంచి స్నేహపూరిత వాతావరణం ఉందని తెలుస్తోంది.

తాజగా కరోన విపత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్ బ్యాంక్స్, ఉచిత అంబులెన్స్ సర్వీసులు వంటి సేవ కార్యక్రమాలు చేస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుగా ఒకడుగు ముందుకేసి తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్. ఇక ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని పవన్ కళ్యాణ్ కి, బీజేపీకి చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓట్లను ఇప్పటి నుంచే గాలం వేసే పనిలో ఉంది జగన్ సర్కార్. దీంతో ఒకపక్క ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీకి చిరంజీవి మద్దతు పలుకుతున్నాడన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి చిరంజీవి మానియాను వాడుకునేందు జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇచ్చి వైసీపీకి అనుకూలంగా మల్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు జగన్ వర్గీయులు చెబుతున్న మాట. ఇక మొత్తానికి చిరంజీవికి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇస్తారా? లేక ఒక ఇదంతా పుకార్ల అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: