మరో ప్రాజెక్ట్ తో రెడీ అయిన రాహుల్ రవీంద్రన్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు హీరో రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత నటనలో రాణిస్తూనే దర్శకత్వంపై మక్కువతో సినిమాలు సైతం తెరకెక్కించాడు ఈ యువ డైరెక్టర్. ఇక చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారి తొలి చిత్రానికే నేషనల్‌ అవార్డు సైతం వరించింది.

దీంతో రెండో సినిమా నాగార్జునతో తీసిన మన్మథుడు-2 బాక్స్‌ఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా మరో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడట ఈ డైరెక్టర్ కమ్ హీరో. ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సిద్దం చేసినట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: