కన్నడ హీరో సంచారీ విజయ్ కన్నుమూత

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ హీరో జాతీయ అవార్డు గ్రహీత సంచారీ విజయ్‌ కన్నుమూశాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన ఆయన సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రంగ్గప్పా హోగ్బిట్నా’తో కన్నడ చిత్రసీమకు పరిచయమైన విజయ్‌.. ‘దాస్వాళ’, ‘హరివు’, ‘ఒగ్గరణె’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వర్తమాన’, ‘సిపాయి’ వంటి సినిమాలతో అభిమానులకు దగ్గరయ్యారు. కాగా 2015లో వచ్చిన ‘నాను అవనల్ల, అవళు’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకోవడం విశేషం. ఈయన మరణంతో కన్నడ సినిమా పరిశ్రమలో విశాద చాయలు అలుముకున్నాయి. విజయ్‌ మరణంతో కన్నడ పరిశ్రమ పెద్దలు సంతాపం తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: