హిట్లర్ పార్టీ అంటూ అందులోనే చేరారు- జగదీశ్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో స్పందించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. బీజేపీ హిట్లర్ పార్టీ అన్న ఈటల రాజేందర్ బీజేపీలోనే చేరటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ నుంచి ఈటల వెళ్లినంత మాత్రన పార్టీకి ఎలాంటి నష్టం లేదని వెళ్లిన వారే నష్టపోతారన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈటలకు సముచిత స్థానం కల్పించామని, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లాక ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మంత్రి. పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను నల్ల చట్టాలన్న ఈటల మాటలకు పొంతన లేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుందని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: