అన్ని స్థానాల నుంచి పోటీకి దిగుతామంటున్న కేజ్రీవాల్

Google+ Pinterest LinkedIn Tumblr +

అహ్మదాబాద్ లోని నవ్రంగ నవ్రంగ్‌పుర ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం. రానున్న గుజరాత్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి మా పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు సీఎం.

గుజరాత్ లో ఉన్న మొత్తం 182 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు. ఇక కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు ప్రముఖ పాత్రికేయుడు ఇసుదన్ గాద్వి. ఇక మొత్తానికి ప్రధాని సొంత రాష్ట్రంలో ఆప్ పార్టీని విస్తరించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడంతో ఈ సారి ఎలాగైన ప్రధానిని దెబ్బకొట్టే దిశగా అడుగుల వెస్తున్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: