భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న సమంత?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రలో అగ్ర కథానాయికల లీస్టులో అగ్రభాగానికి ఎగబాకారు సామ్. ఏమాయె చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ అందివచ్చిన అవకాశాలను తెలివిగా అందుకుంటూ తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు.

తాజాగా సామ్ ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్‌లో న‌టించి డిజిట‌ల్ స్క్రీన్‌పై తన హవాను చాటుకుంటోంది. ఈ మూవీతో మరోసారి తన నటనతో వావ్ అనిపించిందనే చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్న తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్‌ను ఆమె వదులుకున్నట్లు తెలుస్తోంది. గ్లామరస్ పాత్రలను పక్కనబెట్టి డీ గ్లామర్ పాత్రలకే ఎక్కువ మక్కువ చూపుతున్ననేపథ్యంలోనే ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: