పార్టీ ప్రకటనకు ముందే రాజీనామాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం కావాలంటూ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టింది. తెలంగాణలోని అన్ని జిల్లా నేతలతో వరుసగా సమావేశమవుతూ సమకాలీన సమస్యలపై స్పందిస్తోంది షర్మిల.

ఇక పార్టీ ప్రకటనను జూలై 8న ప్రకటిస్తానని చెప్పిందో లేదో అప్పుడే కొందరు నేతలు అడ్‌హక్ కమిటీకి రాజీనామాలు చేశారట. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఇక్కడ సరైన గుర్తింపు దక్కడం లేదంటూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హక్ కమిటీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ప్రకటన రాకముందే కొందరు నేతలు రాజీనామా చేస్తుండడంతో అప్పుడే ముసలమా? అంటూ కొందరు ఇతర పార్టీ నేతలు మురిసిపోతున్నారట.

 

Share.

Comments are closed.

%d bloggers like this: